Advertisementt

వార్ 2 పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన హృతిక్

Fri 16th Feb 2024 07:52 PM
hrithik roshan  వార్ 2 పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన హృతిక్
Hrithik To Start Shooting For War 2 On వార్ 2 పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన హృతిక్
Advertisement
Ads by CJ

దేవర చిత్రం ఏప్రిల్ 5 న విడుదలవుతుంది.. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొంటాడని ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.  కానీ ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తూ దేవర మూవీ ఏకంగా దసరాకి వెళ్ళిపోయింది. అక్టోబర్ 10 న దేవర విడుదల అంటూ కొత్త డేట్ లాక్ చేసారు. దానితో ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లోకి ఎప్పుడు అడుగుపెడతాడో అనే విషయంలో ఆయన ఫాన్స్ అయోమయంలోకి వెళ్లారు. ఈలోపు వార్ 2 హీరో హృతిక్ రోషన్ వార్ 2 పై బిగ్గెస్ట్ అప్ డేట్ అందించాడు.

రీసెంట్ గా ఫైటర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హృతిక్ రోషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వార్ 2 పై కీలక అప్ డేట్ ఇచ్చాడు. అతి త్వరలోనే వార్ 2 మొదలు కాబోతుంది. ఇకపై నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం దొరకదేమో అంటూ చెప్పడం చూసిన ఎన్టీఆర్ ఫాన్స్.. ఎన్టీఆర్ ఇకపై దేవర షూట్ తో పాటుగా వార్ 2 సెట్స్ లోకి వెళతాడు.. అటు ముంబై ఇటు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటే దేవరపై నార్త్ లో మరింతగా క్రేజ్ పెరిగిపోతుంది అంటూ దేవర పోస్ట్ పోన్ పై సమాధాన పడుతున్నారు.

బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా మొదలు కాబోయే చిత్రంలో యంగ్ టైగర్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తాడనే న్యూస్ ఎన్టీఆర్ ఫాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 పై భీబత్సమైన అంచనాలున్నాయి. ఈనెల 23 నుంచి వార్ 2 రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అని.. ఓ రెండు వారాల పాటు హృతిక్ రోషన్ పై ఇంట్రో సీన్స్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. మరి వార్ 2 లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Hrithik To Start Shooting For War 2 On :

Hrithik Roshan To Start Shooting For War 2 On Feb 23

Tags:   HRITHIK ROSHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ