Advertisementt

జాన్వీ కపూర్ వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్స్ రివీల్డ్

Fri 16th Feb 2024 07:11 PM
janhvi kapoor  జాన్వీ కపూర్ వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్స్ రివీల్డ్
Janhvi Kapoor Workout and Diet Plans జాన్వీ కపూర్ వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్స్ రివీల్డ్
Advertisement
Ads by CJ

దేవర లాంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా చిత్రంతో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కి మరో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీలో ఛాన్స్ వచ్చింది అది కూడా.. రామ్ చరణ్ తో అంటూ ప్రచారం జరుగుతుంది. అదెలా ఉన్నా.. బాలీవుడ్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి కిందా మీదా పడుతున్న జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గదు. ట్రెండ్ కి తగ్గట్టుగా మోడరన్ డ్రెస్సులతో అందాలు ఆరబోసే జాన్వీ కపూర్ ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తుంది. వర్కౌట్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది.

తాజాగా జాన్వీ కపూర్ వర్కౌట్స్ అలాగే ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో అనేది సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రతి రోజు జాన్వీ కపూర్ వర్కౌట్స్ లో ముందుగా కార్డియో స్ర్టెంత్‌ ట్రైనింగ్‌ యోగా ఉంటుందట. అందులో భాగంగా రన్నింగ్‌, సైక్లింగ్ లేదా డ్యాన్స్‌తో 45 నిమిషాల కార్డియో సెషన్ ఉంటుందట‌. వాటితో పాటుగా స్క్వాట్స్‌, పుషప్స్‌, లంగె, వెయిట్‌ లిఫ్టింగ్ లాంటివి కూడా ఫాలో అవుతుందట. అంతేకాదు కాసేపు యోగా కూడా చేస్తుందట. ఒత్తిడిని అధిగ మించేదుకు ధ్యానం చేస్తుందిట‌.

ఇక డైట్ లో భాగంగా జాన్వీ కపూర్ ఉదయం లేవగానే.. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, బ్రెడ్‌ టోస్ట్‌, అలాగే గ్రీన్ టీ తీసుకుంటందిట‌. మధ్యాన్నం మాత్రం గ్రిల్‌డ్‌ చికెన్‌ లేదా వెజిటబుల్స్‌, బ్రౌన్‌ రైస్‌తో ఫిష్‌, సాయంత్రం స్నాక్స్ లో ప్రూట్ స్మూతీ, దానితో పాటుగా డ్రై ఫ్రూట్స్ లో బాదం, పిస్తా, జీడిప‌ప్పు తీసుకుంటుందట. డిన్న‌ర్ కి సింపుల్ గా గాసూప్, గ్రిల్‌డ్‌ ఫిష్‌ లేదా చికెన్‌ సలాడ్ వి ప్రిఫర్ చేస్తుందట. మరి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే ఈ మాత్రం డైట్, అలాంటి వర్కౌట్స్ ఉండాల్సిందే కదా..!

Janhvi Kapoor Workout and Diet Plans:

Janhvi Kapoor Workout and Diet secrets out

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ