Advertisementt

అనుష్క-క్రిష్ టైటిల్ అదేనా?

Fri 16th Feb 2024 03:21 PM
anushka  అనుష్క-క్రిష్ టైటిల్ అదేనా?
Speculation on Anushka-Krish title అనుష్క-క్రిష్ టైటిల్ అదేనా?
Advertisement
Ads by CJ

దర్శకుడు క్రిష్.. పవన్ తో చెయ్యాల్సిన  హరి హర వీరమల్లు షూటింగ్ కి భారీ గ్యాప్ రావడంతో సైలెంట్ గా ఆయన తన తదుపరి మూవీని మొదలు పెట్టేసారు. వేదం చిత్రంలో కీలక పాత్రలో చూపించిన అనుష్క తో క్రిష్ కొత్త చిత్రాన్ని మొదలు పెట్టారు. అనుష్క కూడా సైలెంట్ గా మీడియా ముందుకు రాకూండా సినిమాలు చేస్తూ వస్తుంది. నిశబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు చేసిన అనుష్క నెక్స్ట్ మూవీ ఏమిటో అనుకునేలోపు క్రిష్ తో మూవీ మొదలు పెట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రీసెంట్ గా మొదలైన ఈ చిత్రం ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ పరిసర ప్రాంతాల్లో ఓ పది రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 

ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ ఓ టైటిల్ అనుకున్నారట. అదే శీలావతి. శీలావతి పేరు వినగానే అందరికి ఒక చేప పేరు గుర్తుకు వస్తుంది. మరి ఈ టైటిల్ దేనికి సంబంధించింది అయినా వినడానికి కొత్తగా ఉంది. ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉండి వెంటనే పాపులర్ అవుతుంది అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కకు జోడీగా నటిస్తున్నాడు అనుష్క మాత్రం తన బరువు కారణంగా మీడియా ముందుకు కనిపించకుండా ఇలా కామ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. 

Speculation on Anushka-Krish title:

Is this Anushka-Krish title

Tags:   ANUSHKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ