Advertisementt

ప్రభాస్ క్రష్ కాదు కానీ: పీవీ సింధు

Thu 15th Feb 2024 05:31 PM
pv sindhu  ప్రభాస్ క్రష్ కాదు కానీ: పీవీ సింధు
PV Sindhu Sensational Comments on Tollywood Heroes ప్రభాస్ క్రష్ కాదు కానీ: పీవీ సింధు
Advertisement
Ads by CJ

పీవీ సింధూని.. ప్రభాస్ అంటే క్రష్ అంటగా! అని తన ప్రశ్నలతో ఎప్పుడూ ఎదుటివారిని బోల్తా కొట్టిస్తాననే ధ్యాసలో ఉండే జాఫర్ అడిగాడు. దీనికి పీవీ సింధు ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? క్రష్ అదీ ఇదీ కాదు.. ప్రభాస్ అంటే ఇష్టం అంతే. అయితే నాకు ఇష్టమే కానీ.. ఇప్పటి వరకు ఆయనను కలవలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు.. అని చెప్పుకొచ్చిందీ బ్యాడ్మింటన్ స్టార్. అయితే ప్రభాస్ సినిమాలు బాగా చూస్తానని మాత్రం పీవీ సింధు పేర్కొంది. 

ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి వారి సినిమాలు కూడా బాగా చూస్తానని తెలిపింది. బాగా ఇష్టమైన నటులంటే మాత్రం.. అందరూ ఇష్టమే కానీ.. రామ్ చరణ్, ఎన్టీఆర్ అంటే కాస్త ఎక్కువ ఇష్టపడతానంది. ఆర్ఆర్ఆర్ సినిమా తనకు బాగా నచ్చిందని తెలిపింది. రామ్ చరణ్ తనకు బాగా తెలుసని కూడా సింధు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు రెండు సార్లు ఒలింపిక్స్ పతకాలు వచ్చిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఆహ్వానించి, సత్కరించి.. అందరికీ పార్టీ ఇచ్చారని.. నిజంగా అది ఎప్పటికీ మరిచిపోలేనని, ఆ సమయంలోనే రామ్ చరణ్‌ని కూడా కలిశానని పీవీ సింధు చెప్పుకొచ్చింది. 

ఇక విజయ్ దేవరకొండ గురించి చెబుతూ.. విజయ్ దేవరకొండ సినిమాలు కూడా చూస్తాను. అందులో కొన్ని నచ్చాయి.. కొన్ని నచ్చలేదు. ఏయే సినిమాలు నచ్చలేదు అని చెబితే.. అది ఇప్పుడో పెద్ద కాంట్రవర్సీ అవుతుందని చెప్పిన సింధు.. సినిమా రంగానికి చెందిన వారిని వివాహం చేసుకోవాలనే ఆలోచన తనకి లేదని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PV Sindhu Sensational Comments on Tollywood Heroes:

PV Sindhu About Prabhas, Ram Charan, Jr NTR and Vijay Deverakonda

Tags:   PV SINDHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ