Advertisementt

బుజ్జి తల్లి కాస్త నవ్వవే.. రీల్ అదుర్స్

Thu 15th Feb 2024 12:52 AM
chaitu and sai pallavi  బుజ్జి తల్లి కాస్త నవ్వవే.. రీల్ అదుర్స్
Thandel Valentines Day Special Reel Viral బుజ్జి తల్లి కాస్త నవ్వవే.. రీల్ అదుర్స్
Advertisement
Ads by CJ

బుజ్జి తల్లే.. వచ్చేత్తనా కదే.. కాస్త నవ్వే.. అంటూ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న చిత్రం తండేల్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లోని చివరి డైలాగ్‌ని చైతూ, సాయి పల్లవి తాజాగా రీల్ చేశారు. 

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మేకర్స్ ఈ రీల్‌ను విడుదల చేయగా.. సోషల్ మీడియాకు దీనికి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఇందులో చైతూ, సాయి పల్లవి అభినయం అందరినీ అలరిస్తోంది. గ్లింప్స్ వదిలినప్పుడు ఎలా అయితే అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారో.. ఈ రీల్‌తో సోషల్ మీడియాలో అలాంటి సందడే నెలకొంది. పర్ఫెక్ట్ డే‌న పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ నెటిజన్లు ఈ రీల్‌కు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, బుజ్జి తల్లిగా అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. తండేల్ సినిమాలో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండబోతుందని గ్లింప్స్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే రెండోసారి కలిసి చేస్తున్న నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మెస్మరైజింగ్ చేయనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఇందులో తన పాత్ర కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Thandel Valentines Day Special Reel Viral:

Raju and his Bujji thalli share their love across the Oceans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ