Advertisementt

ప్రేమికుల రోజు.. బెటర్ హాఫ్‌‌తో చిరు

Wed 14th Feb 2024 09:49 PM
megastar chiranjeevi valentines day  ప్రేమికుల రోజు.. బెటర్ హాఫ్‌‌తో చిరు
Megastar Chiranjeevi Valentines Day Special ప్రేమికుల రోజు.. బెటర్ హాఫ్‌‌తో చిరు
Advertisement
Ads by CJ

నేడు వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమికుల దినాన్ని ప్రేమికులందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమయ్యారు. అదెలా అనుకుంటున్నారా? ప్రేమికుల రోజున తన బెటర్ హాఫ్‌ని తీసుకుని హాలీడే నిమిత్తం ఆయన అమెరికాకు పయనమయ్యారు. ఈ విషయం ట్విట్టర్ వేదికగా మెగాస్టారే తెలియజేశారు. తన భార్యతో కలిసి అమెరికా వెళుతున్న ఫొటోని కూడా ఆయన షేర్ చేశారు. అంతే కాదండోయ్.. అందరికీ ప్రేమికుల రోజు అదే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా చెప్పారు.

విశ్వంభర షూటింగ్‌ నుంచి చిన్న బ్రేక్ లభించడంతో.. ఇలా నా బెటర్ హాఫ్‌ని తీసుకుని హాలీడే నిమిత్తం అమెరికా వెళుతున్నాను. నేను తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర చిత్రీకరణ పున:ప్రారంభిస్తాను. త్వరలోనే కలుద్దాం.. అన్నట్లు అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.. అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్‌లో పేర్కొన్నారు. దీనికి ఫ్యాన్స్.. ఎంజాయ్ ద ట్రిప్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 

మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. బింబిసార దర్శకుడు వశిష్ఠతో ఆయన ప్రస్తుతం విశ్వంభర అనే భారీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్ ప్రారంభించుకుంది. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో సినిమాను కూడా కమిట్ అయ్యారనేలా ఇటీవల వార్తలు వినిపించాయి. చిరు పెద్ద కుమార్తె సుస్మిత సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుందని, హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనేలా వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Megastar Chiranjeevi Valentines Day Special:

Megastar Chiranjeevi Valentines Day Greetings

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ