Advertisementt

సోనియా అగర్వాల్ సంచలన నిర్ణయం

Wed 14th Feb 2024 09:18 PM
sonia agarwal pudhupettai 2  సోనియా అగర్వాల్ సంచలన నిర్ణయం
Sonia Agarwal Ready to work with Her Ex Husband సోనియా అగర్వాల్ సంచలన నిర్ణయం
Advertisement
Ads by CJ

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. అనే డైలాగ్‌లా ఇప్పుడు 7జి బృందావన కాలనీ బ్యూటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తన మాజీ భర్త‌తో కలిసి మళ్లీ పని చేసేందుకు సై అంటోంది. 7జి బృందావన కాలనీ సినిమాతో అప్పటి కుర్రాళ్ల గుండెలని పిండేసిన సోనియా.. ఆ తర్వాత ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ (తెలుగు ప్రేక్షకులకు శ్రీరాఘవ‌గా పరిచయం)ను విహహం చేసుకుని, కొన్నాళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంది. వారి విడాకులకు పలు కారణాలు వినిపించినా.. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కొంత కాలానికి సెల్వరాఘవన్ మరో వివాహం చేసుకున్నారు. సోనిమా మాత్రం అలాగే ఉండిపోయింది. 

ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ కలిసి పని చేయబోతున్నారనేలా టాక్ వినబడుతోంది. అందుకు కారణం 2006లో వచ్చిన ఓ సినిమా. ధనుష్ హీరోగా సోనియా అగర్వాల్, స్నేహ హీరోయిన్లుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం పుదుపేట. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సెల్వరాఘవన్ ప్లాన్ చేస్తున్నారని కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో టాక్ వినబడుతోంది. సెల్వరాఘవన్ కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తూ.. పుదుపేట 2 ఈ సంవత్సరమే ప్రారంభం అవుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో అంతా ఈ సినిమాలో చేసిన సోనియా అగర్వాల్ గురించి మాట్లాడుకుంటున్నారు.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. సెల్వరాఘవన్ పుదుపేట2 ప్రకటించారు. అందులో మీరు నటిస్తున్నారా? అనే ప్రశ్నకు సోనిమా సమాధానమిస్తూ.. నటన అనేది నా వృత్తి. దానిని నా పర్సనల్ విషయాలకు లింక్ పెట్టను. పుదుపేట2లో నటించే అవకాశం నా వరకు వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను. సెల్వతో మళ్లీ కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరాలు, ఈగోలు లేవు. అయితే నాకు అలాంటి పిలుపు అయితే ఇప్పటి వరకు రాలేదు. పార్ట్ 2లో ఎవరెవరు నటిస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు. నా వరకు వస్తే మాత్రం నో అని చెప్పను.. అని చెప్పుకొచ్చింది. 

Sonia Agarwal Ready to work with Her Ex Husband:

Sonia Agarwal Takes Sensational Decision for Pudhupettai 2 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ