పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు వచ్చినా.. అందులో అతని మ్యానరిజమ్స్ కోటలు దాటినా.. సుకుమార్ ఎంత గొప్పగా దర్శకత్వం చేసినా.. ఆ సినిమా సక్సెస్‌లో సమంత పాత్రని మాత్రం మరిచిపోకూడదు. ఒక్క పాటతో అందరికీ ఊపు తెప్పించింది. ఈ స్పెషల్ సాంగ్ ఒక్క తెలుగులోనే కాకుండా.. ప్రపంచమంతటా ఓ ఊపు ఊపేసింది. అందుకే అనేది.. పుష్ప సక్సెస్‌లో సమంత పాత్ర కూడా చాలా ఉంది అని. మరి అలాంటి సమంతను సెకండ్ పార్ట్‌లో స్పెషల్ సాంగ్ కోసం కూడా కంటిన్యూ చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సారి సమంత ఎలా ఊ అనిపిస్తుందో అని అంతా అనుకుంటున్న వేళ.. ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
అదేమంటే.. పుష్ప2లో ఊ అనిపించేది సమంత కాదట. ఈసారి స్పెషల్ బాంబ్‌ని బాలీవుడ్ నుండి దించుతున్నారట. బాలీవుడ్ వాళ్లు కూడా సమంత నామ స్మరణ చేస్తుంటే.. సుకుమార్, బన్నీ ఏంటో బాలీవుడ్ అమ్మాయిని తెచ్చుకుంటున్నారంటూ మరో వైపు కౌంటర్లు కూడా మొదలయ్యాయి. ఇంతకీ ఆ బాలీవుడ్ భామ ఎవరని అనుకుంటున్నారా? పూరి జగన్నాధ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన లోఫర్ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశా పటానీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడటంతో దిశా.. టాలీవుడ్ దిశలకు చేరుకోలేకపోయింది. లేదంటే.. ఈ హాట్ బ్యూటీ కూడా తెలుగులో ట్రెండ్ లేపేది. ఏం చేస్తం టైమ్ బాగాలేదు అని అనుకోవడమే.
సరే.. విషయంలోకి వస్తే.. పుష్ప2లో ఐటం సాంగ్ కోసం దిశా పటానీని సెలక్ట్ చేశారట. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఆల్మోస్ట్ ఐటమ్‌కి దిశా పటానీ ఓకే చెప్పిందని, త్వరలోనే ఆ పాట చిత్రీకరణలో పాల్గొనుందనేలా బాలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కారణంగా ఇలా జరిగిందా? లేదంటే, కావాలనే ఐటమ్ భామను మార్చారో తెలియదు కానీ.. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.