రకుల్ ప్రీత్ సింగ్ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతుంది. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో ఏడడుగులు నడిచేందుకు రకుల్ ప్రీత్ సిద్ధమైంది. గత నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీలు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేసారు. పుట్టిన రోజులకి స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రకుల్ కూడా పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. ఎగిరిపడుతూనే ఇప్పుడు పెళ్లి కి రెడీ అయ్యింది. ఈ నెల 21 న గోవా వేదికగా రకుల్ ప్రీత్ పెళ్లి జరగబోతుంది.
ముందుగా విదేశాల్లో వివాహం చేసుకుందామనుకున్న రకుల్-జాకీలు తమ ప్రేమ చిగురించిన స్థలమైన గోవాకి తమ పెళ్లి వేదికని మార్చుకున్నారు. రకుల్ ప్రీత్ మూడు రోజులపాటు పెళ్లి చేసుకోబోతుంది. గోవా లోనే రకుల్ పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీ ల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ అండ్ బ్లూ కలర్ లో సింపుల్ గా రకుల్-జాకీల పేర్లు వేశారు. కొబ్బరి చెట్లు, బీచ్ లతో ఆ కార్డు స్పెషల్ గా డిజైన్ చేసారు.
మరి పెళ్లి డేట్ దగ్గరకొచ్చేసినా రకుల్ ప్రీత్ మాత్రం సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఫోటో షూట్స్ చేస్తుంది. రకుల్ పెళ్లి కోసం బాలీవుడ్ టాప్ డిజైనర్లు పెళ్లి దుస్తుల్ని తయారు చెయ్యగా.. మూడు రోజుల వేడుకల కోసం రకుల్ ప్రీత్ స్పెషల్ డిజైనర్ వేర్ డ్రెస్సులని తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రకుల్ పెళ్లి తర్వాత కూడా నటనకు ఫుల్ స్టాప్ పెట్టదని తెలుస్తోంది. ఎందుకంటే రకుల్ కి ఈ మధ్యన క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ ఉంది.