సుకుమార్-అల్లు అర్జున్ కలయికలో ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కిన పుష్ప ద రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ లో గంగమ్మ జాతర ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు సుకుమార్. 40 రోజుల భారీ షెడ్యూల్ లో ఈ జాతర ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈమధ్యన పుష్ప 2 కీలక పాత్రధారి జగదీశ్ జైలుకెళ్ళడంతో పుష్ప 2 వాయిదా పడుతుంది. అల్లు అర్జున్ హెల్త్ రీజన్స్ తో ఆగష్టు 15 న పుష్ప 2 విడుదల సాధ్యమయ్యే పని కాదు అన్నారు.
కానీ యూనిట్ మాత్రం పుష్ప 2 అనుకున్న సమయానికే రిలీజ్ అని నొక్కి చెబుతున్నారు. మరోపక్క శ్రీవల్లిగా డాన్సులతో ఓ ఊపు ఊపిన రష్మిక మందన్న కూడా పుష్ప 2 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. రష్మిక మందన్న పుష్ప సెట్లో దర్శకుడు సుకుమార్ ఫోటోని ఒకటి క్లిక్ చేసి షేర్ చేసుకుంది. ఆ పిక్ ని అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి ఆగస్ట్ 15 డేట్ ని మరోసారి స్పష్టంగా చెప్పారు. మరి ఏది ఏమైనా.. ఎన్టీఆర్ దేవర ఆగష్టు 15 కి అన్నా.. పుష్ప 2 మాత్రం అనుకున్న సమయానికే అని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిన పుష్ప 2 ని జూలై కల్లా పూర్తి షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పబ్లిసిటీ స్టార్ట్ చెయ్యాలని సుకుమార్ అండ్ టీం ఎదురు చూస్తుందట.