దర్శకుడు హరీష్ శంకర్ ని ఎవరైనా కెలికితే సర్రున లేస్తాడు. తనని ట్రోల్ చేసే వారిని వదలడు. సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ వాళ్ళని ఏకి పడేస్తాడు. తాజాగా ఈగల్ సక్సెస్ మీట్ లో హరీష్ శంకర్ తన ఫోటోని పెట్టకుండా షాడో పిక్ పెట్టి తనపై గాసిప్స్ క్రియేట్ చేసే సైట్ పై విరుచుకుపడ్డాడు. నాకు ఐదేళ్లపాటు సినిమా లేదు, ఖాళీగా ఉండి తాగుతున్నాను అంటూ రాసారు, నా ఫోటో పెట్టకుండా రాయడమెందుకు దమ్ముంటే నా ఫోటో పెట్టి రాసుకోండి అంటూ హరీష్ కోపంగా మాట్లాడాడు.
తానిప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాను, తాను త్వరలోపెద్ద హీరోలతో మరో రెండు చిత్రాలు ప్లాన్ చేశానని, వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా త్వరలోనే వస్తాయని కాస్త ఆవేశంగానే చెప్పాడు. నాపై ట్రోల్స్ ఇప్పుడు కాదు.. నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడు నా తల్లితండ్రులు మాత్రమే కాదు, మా చుట్టాలు కూడా నన్ను ట్రోల్ చేసారు. నాకు ట్రోల్స్ కొత్తేమి కాదు అంటూ హరీష్ తనపై ట్రోల్ చేసే వారిపై విరుచుకుపోయాడు. ఇక రివ్యూస్, రేటింగ్స్ అంటూ వాటిపై కూడా హరీష్ శంకర్ సెటైర్స్ వేసాడు.