కొద్దిరోజులుగా ఏపీ లో తుఫాను సృష్టిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం రాజకీయాలకు చిన్నపాటి బ్రేకిచ్చారు. తెలంగాణాలో పార్టీ పెట్టి ఎన్నికల సమయానికి కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల కాంగ్రెస్ అధిష్టానం తనకిచ్చిన మాటతో ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంటర్ అయ్యింది. గత పదేళ్లుగా ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ కి షర్మిల ఎంట్రీ కొత్త ఊపిరినిచ్చింది. షర్మిల ఏపిలోకి దిగింది మొదలు ప్రస్తుతం ఏపీ సీఎం, షర్మిల అన్న జగన్ పై బాణంలా దూసుకుపోతూ సంచలన ఆరోపణలు చేస్తుంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జగన్, బిజెపి ఇలా ఏపీ పార్టీలపై విరుచుకుపడిపోతున్న షర్మిల ఇప్పుడు ఊపు తగ్గించారు. నిన్నటివరకు సభలు సమావేశాలు నిర్వహించిన షర్మిల ఇకపై కొడుకు రాజారెడ్డి పెళ్లి కోసం బ్రేక్ తీసుకోనున్నారు. ఈ నెల 17 రాజస్థాన్ వేదికగా రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో జరగబోతుంది. గత నెల ఫిబ్రవరిలో హైదరాబాద్ లో రాజారెడ్డి రిసెప్షన్ నిర్వహించనున్నారు. షర్మిల కొడుకు పెళ్లి కి పలువురు రాజకీయనేతలని కలిసి పెళ్లి కార్డు ఇచ్చి వచ్చింది.
ఈ నెల 17 న రాజస్థాన్ జరగబోయే పెళ్లి కోసం షర్మిల వెళ్ళబోతున్నారు. అక్కడ పెళ్లి పనులు అవి చూసుకోవడం, పెళ్లి వేడుకల కోసం ఆమె వెళుతున్నారు. రాజస్థాన్ లో వివాహం తరవాత షర్మిల మళ్ళీ హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. ఈ రిసెప్షన్ కి చంద్రబాబు, పవన్, ఇంకా కాంగ్రెస్ నేతలు హాజరవుతారని, ఈ పెళ్లిలో జగన్ ఆయన భార్య స్పెషల్ గా కనిపిస్తారని అంటున్నారు. స్పెషల్ ఎందుకు అంటే రాజకీయాల్లో శత్రువుగా మారిన జగన్ షర్మిల ఇంట పెళ్లి వేడుకకి హాజరవడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా..!