Advertisementt

మెగాస్టార్ విశ్వంభర పై క్రేజీ న్యూస్

Mon 12th Feb 2024 10:57 AM
viswambhara  మెగాస్టార్ విశ్వంభర పై క్రేజీ న్యూస్
Interesting news on Viswambhara మెగాస్టార్ విశ్వంభర పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వసిష్ఠతో రీసెంట్ గా మొదలు పెట్టిన విశ్వంభర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. పండగ తర్వాత చిరు విశ్వంభర షూటింగ్ లో జాయిన్ అయ్యారు. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లోకి క్రేజీ హీరోయిన్ త్రిష ఎంటర్ అవ్వగా.. చిరు-త్రిష లపై ఓ ఇంట్రెస్టింగ్ డ్యూయెట్ ని తెరకెక్కించినట్టుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకుని మరో షెడ్యూల్ ని వశిష్ట షురూ చేసారు.

తాజాగా విశ్వంభర పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను వేస్తున్నట్లుగా టాక్. ఈ సీక్వెన్స్ లో చిరంజీవి అలాగే కొంతమంది విలన్స్ పై పవర్ ఫుల్ భారీ యాక్షన్ సీన్స్ ను ఘాట్ చేస్తారట. ఈ సీన్స్ లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉండబోతుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మెగాస్టార్ చిరంజీవి గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా జనవరి 10 న విడుదలకు డేట్ లాక్ చేసిన వసిష్ఠ ఈ చిత్రంలో ఫాంటసీ హైలైట్ చేయబోతున్నారట. ఇక ఈచిత్రంలో మెగాస్టార్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తారని అందులో త్రిష మొదటి హీరోయిన్ గా ఎంపిక కాగా.. మిగతా ఇద్దరి కోసం వశిష్ట వేటలో ఉన్నాడట.

Interesting news on Viswambhara:

Viswambhara shooting update

Tags:   VISWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ