Advertisementt

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటీ డేట్ వస్తోంది

Sun 11th Feb 2024 02:16 PM
ambajipeta marriage band  అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటీ డేట్ వస్తోంది
Ambajipeta Marriage Band OTT Date Coming అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటీ డేట్ వస్తోంది
Advertisement
Ads by CJ

సుహాస్ హీరోగా ఫిబ్రవరి 2 న థియేటర్స్ లో విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిన్న సినిమాగా ప్రేక్షకుల మనసులని దోచేసింది. ప్రీమియర్స్ తోనే సినిమాపై ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంప్రెషన్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో యూనిట్ ని కాస్త నిరాశ పరిచినా మౌత్ టాక్ తోనే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ కలెక్షన్స్ పుంజుకున్నాయి. మొదటి వారాంతానికే ఈచిత్రం బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈచిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 2 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం నెల తిరక్కుండానే మార్చ్ 1 న ఓటిటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్సీ రేటుతో ప్రముఖ ఓటిటీ సంస్థ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 1 న స్ట్రీమింగ్ చెయ్యడానికి ఆహా వారు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Ambajipeta Marriage Band OTT Date Coming:

OTT: Ambajipeta Marriage Band streaming date locked?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ