తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీ తారగా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళనాట వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కీర్తి సురేష్ సైరన్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. తెలుగులో భోళా శంకర్ ప్లాప్ తర్వాత కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో అంతగా వినిపించడం లేదు. కానీ తమిళనాట జోరు చూపిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం సైరన్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
ఈ ప్రమోషన్స్ లో చిత్ర విషయాలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలని షేర్ చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తాను సినిమాల్లోకి రాకముందు స్నేహితులతో కలిసి ఓ వ్యక్తిని కొట్టినట్టుగా చెప్పింది. సినిమాల్లోకి ఎంటర్ కాక ముందు ఒక రోజు ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లా. నైట్ టైమ్ లో సరదాగా మేమంతా రోడ్డుపై నడుస్తున్నాం. అదే సమయంలో ఓ వ్యక్తి బాగా తాగేసి అటూ వైపు నడుస్తూ వస్తున్నాడు. నా వెనకకు రాగానే నన్ను ముట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. కావాలనే అతడు నన్ను తాకాడని అర్థమైంది. నాకు చాలా కోపం వచ్చింది.
నన్ను తాకగానే అతడిని పట్టుకుని అక్కడే చెంపపై కొట్టాను. అప్పుడు ఆ వ్యక్తి ఉన్నట్టుండి నాపై దాడి చేశాడు. నా తలపై విపరీతంగా కొట్టాడు. దానితో నేను షాకవుతూనే.. నేను, నా ఫ్రెండ్స్ కలిసి అతడిని చితకబాది మరీ వెంటనే పోలీసులకు అప్పగించాం. దానితో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆరోజు రాత్రంతా అతడిని జైలులోనే ఉంచి ఉదయాన్ని వదిలారు అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.