రవితేజ వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నారు. ఒక హిట్టు రెండు ప్లాప్స్ అన్నట్టుగా ఆయన కెరీర్ సాగుతుంది. క్రాక్ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అవ్వగా.. ధమాకా, వాల్తేర్ వీరయ్య రిలీఫ్ నిచ్చినా.. తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరావు లతో మళ్ళీ రవితేజ కెరీర్ డౌన్ అయ్యింది. రవితేజ రీసెంట్ ఫిల్మ్ ఈగల్ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈచిత్ర ప్రమోషన్స్ ని మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ప్రమోట్ చేసారు.
నిన్న విడుదలైన రవితేజ ఈగల్ కి సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. క్రిటిక్స్ నుంచి ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓ ప్రముఖ వెబ్ సైట్ ఈగల్ విడుదలకు ముందు ఈగల్ ని బాగానే ప్రమోట్ చేసింది. కానీ సినిమా విడుదలయ్యాక ఈగల్ కి డిసాస్టర్ రేటింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఈగల్ మూవీకి మరీ 1.5 రేటింగ్ ఇవ్వడం, అది కూడా ప్రముఖ వెబ్ సైట్ లో రావడం చూస్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనేది వేరే చెప్పక్కర్లేదు.. ఈగల్ సూపర్ బ్లాక్ బస్టర్ అనడం లేదు, అలాగని తీసేసేంత సినిమా కాదు, అంటే 1.5 రేటింగ్ మూవీ కూడా కాదు అన్నమాట.
దీనిని బట్టి కావాలనే ఈగల్ ని కిల్ చేసే ఉద్దేశ్యం ఆ వెబ్ సైట్ కి ఉందేమో అని అర్ధం వచ్చేలా ఈగల్ నిర్మాతల్లో ఒకరు ఈగల్ పోస్టర్ పై పబ్లిక్ రేటింగ్ అంటూ బుక్ మై షో రేటింగ్ పెట్టి.. ఆ వెబ్ సైట్ అని చెప్పుకునే A Great వెబ్ సైట్ లో 1.5 అంటూ వెటకారంగా ఆ వెబ్ సైట్ పేరుని చెప్పకుండా పోస్టర్ వేసి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇదంతా చూస్తుంటే ఈగల్ విషయంలో ఆ వెబ్ సైట్ కావాలనే కుట్ర చేసిందా అనే అనుమానాన్ని నెటిజెన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు.