Advertisementt

పుష్ప 2 నుంచి గంగమ్మ జాతర పిక్ లీక్

Sat 10th Feb 2024 06:31 PM
pushpa 2  పుష్ప 2 నుంచి గంగమ్మ జాతర పిక్ లీక్
Gangamma Jatara pic leaked from Pushpa 2 పుష్ప 2 నుంచి గంగమ్మ జాతర పిక్ లీక్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ అధిక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. పుష్ప లో కీలక పాత్రధారి ఓ కేసులో జైలుకి వెళ్లడంతో నిన్నమొన్నటివరకు పుష్ప యూనిట్ లో అయోమయం నెలకొన్న.. ప్రస్తుతం జగదీష్ బెయిల్ పై రావడంతో పుష్ప2 షూటింగ్ సజావుగా సాగుతుంది. పుష్ప ద రూల్ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో సర్ ప్రైజ్ చేసాడు. దానికి సంబందించిన గంగమ్మ జాతర ఎపిసోడ్ పుష్ప 2 లో మెయిన్ హైలెట్ అంటూ ఎప్పటి నుంచో చెబుతున్నారు.

గంగమ్మ తల్లి జాతరలో భాగంగా వచ్చే సన్నివేశంలోని పిక్ నే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కింద వదిలినట్టుగా తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 40 రోజుల పాటు ఈ కీలకమైన ఎపిసోడ్ షూట్ ని అల్లు అర్జున్ ఇంకా జగదీష్, అలాగే కీలకమైన పాత్రలతో ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈ గంగమ్మ జాతర ఎపిసోడ్ థియేటర్లో నెక్స్ట్ లెవల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతుంది. తాజాగా పుష్ప 2 సెట్స్ నుంచి జాతర సన్నివేశాల షూటింగ్ కు సంబందించిన పిక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ పిక్ లో గంగమ్మ జాతర గెటప్ కోసం ఆఫ్‌-షూట్ లోనూ అల్లు అర్జున్ ఎంతగా కష్టపడుతున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది. కాళ్ళకి పారాణి పెట్టుకుని స్లిప్పర్స్ వేసుకుని అల్లు అర్జున్ కనిపించాడు. ఈ పిక్ ని అల్లు అభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అది కాస్తా వైరల్ గా మారింది.

Gangamma Jatara pic leaked from Pushpa 2:

Pushpa 2 shooting update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ