ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2024-25 అర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం 2,75,891 కోట్ల రూపాయలుగా ప్రకటించడం జరిగింది. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లు. ఇక ఏ రంగానికి ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించారో చూద్దాం.
ఇక అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యువకులను రెచ్చగొట్టడం కాదని.. అక్కున చేర్చుకుని వారికి ఆసరాగా ఉంటామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని భట్టి తెలిపారు. త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలిస్తామన్నారు.
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1546 కోట్లు
విద్యారంగానికి రూ. 21389 కోట్లు
టీఎస్‌పీఎస్సీకి రూ.40 కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
వైద్య రంగానికి రూ.11500 కోట్లు
విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2418 కోట్లు
విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు
మూసీ సుందరీకరణ, అభివృద్ధికి రూ.1000 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ అబ్బివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్
లండన్‌లో థేమ్స్ నదిలా మూసి నది అభివృద్ధి
పాదచారుల జోన్ లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు
పర్యావరణ పద్ధతిలో మూసి డెవలప్‌మెంట్..
ఆరు గ్యారెంటీల కోసం రూ.53196 కోట్లు
పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు
ఐటి శాఖకు రూ.774కోట్లు
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.13,013 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు