నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల హ్యాట్రిక్స్ తర్వాత వాల్తేర్ వీరయ్య తో హిట్ అందుకున్న దర్శకుడు బాబీ తో చెయ్యి కలిపారు. ప్రస్తుతం NBK109 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఏపీలో జరగబోయే ఎన్నికల సమయానికల్లా బాలయ్య - బాబీ కాంబో మూవీ షూటింగ్ ఓ కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదలాఉంటే బాలకృష్ణ తన తదుపరి మూవీని పవన్ కళ్యాణ్ దర్శకుడితో చేస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చెయ్యాలనుకున్న హరీష్ శంకర్ ని నిరాశ పరుస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాలతో ఆ చిత్రానికి బ్రేకులు వేశారు. దానితో హరీష్ ఇప్పుడు రవితేజతో ఓ చిత్రం మొదలు పెట్టారు. అయితే బాలయ్య తో హరీష్ శంకర్ సినిమా కన్ ఫర్మ్ అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా హరీష్ శంకర్ బాలయ్యతో సినిమా చేయబోతున్నారని అంటున్నారు. హరీష్ శంకర్ హీరోలని స్టైలిష్ గా చూపిస్తూనే యాక్షన్ తో దుమ్మురేపుతాడు. మరి బాలయ్యతో హరీష్ ఎలాంటి సినిమాని డిజైన్ చెయ్యబోతున్నాడో చూద్దాం.