అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ లో యాంకరింగ్ చేసినప్పుడు హైట్ కి తగ్గ వెయిట్ తో చాలా అందంగా, ఆకర్షణగా కనిపించేది. ఏ అవుట్ ఫిట్ వేసినా పొడుగు కాళ్లతో ఉండే అనసూయకి సరిగ్గా సెట్ అయ్యేవి. జబర్దస్త్ అందాలను ముందుగా సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ ఆ పద్దతిని అస్సలు మార్చుకోలేదు. సినిమా షూటింగ్స్ కి హాజరవుతూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉండేది. తరచూ స్పెషల్ ఫోటో షూట్స్ వదులుతూ ఇప్పటికీ గ్లామర్ షో చేస్తుంది.
అయితే కొద్దిరోజులుగా అంటే 40 ప్లస్ లోకి ఎంటర్ అయిన అనసూయ వెయిట్ పెరిగి బరువుతో కనిపిస్తుంది. భర్త భరద్వాజ్ తో కలిసి జిమ్ కి వెళ్లి చమటలు కక్కించే అనసూయ తన పిల్లలతో కలిసి స్విమ్మింగ్ కూడా చేస్తుంది. అయితే గత రెండుమూడేళ్లుగా అనసూయ వెయిట్ లాస్ అయ్యేందుకు తెగ వర్కౌట్స్ చేస్తుంది. తాజాగా అనసూయ కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ.. My life got better when I started shedding weight.. weight of other people’s opinions.. 😌😊 #BeYourOwnAuthenticSelf ✨💯(నేను బరువు తగ్గడం ప్రారంభించినప్పుడు నుంచి నా జీవితం మెరుగుపడింది.. బరువుపై ఎవరి అభిప్రాయాల వారివి.. 😌😊) అంటూ క్యాప్షన్ పెట్టింది.
అనసూయ పోస్ట్ చేసిన పిక్స్ లో మోడ్రెన్ గా కనిపించింది. ఆమె చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తూ చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. జీన్స్ ప్యాంట్ నడుము కనిపించే టాప్ తో అనసూయ టూ మోడ్రెన్ అమ్మాయిలా ఫొటోలకి ఫోజులిచ్చింది. జనవరి చివరి వారంలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్లొచ్చిన అనసూయ అక్కడ చిట్టి పొట్టి ఫ్రాక్స్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.