Advertisementt

సోహెల్ లా పవన్ కూడా అడగాల్సిందా?

Thu 08th Feb 2024 03:04 PM
sohel  సోహెల్ లా పవన్ కూడా అడగాల్సిందా?
Is Sohel Pawan the only one? సోహెల్ లా పవన్ కూడా అడగాల్సిందా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో తనని ఎంకరేజ్ చేసి.. సోహెల్ గెలవాలి అంటూ అభిమానులు అరిచారు, బిగ్ బాస్ లో అంతగా లేపారు, కానీ సినిమా తీస్తే చూడడం లేదు అంటూ బిగ్ బాస్ ఫేమ్ హీరో సోహెల్ కన్నీటిపర్యంతమయిన విషయం తెలిసిందే. సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు మూవీ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం పై లో బజ్ ఉండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దానితో సోహెల్ ఎమోషనల్ అవుతూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇప్పుడా వీడియో స్క్రీన్ షాట్ పెట్టి కొంతమంది జనసేన అందులోను పవన్ కళ్యాణ్ యాంటీ అభిమానులు మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో కామెంట్స్ పెట్టారు.. కానీ నా సినిమా ఎందుకు చూస్తలేరు అన్నా అంటూ సోహెల్ పిక్ పెట్టి.. ఆ తర్వాత పవన్ వేడుకుంటున్నట్టుగా పెట్టి థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు కానీ ఓటెందుకు వేస్తలేదు అన్నా అంటూ అడుకుంటున్నట్టుగా పిక్ డిజైన్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరి హీరోల అభిమానుల కన్నా ఎక్కువ, ఆయన ఫాన్స్ తలచుకుంటే పవన్ ఎమ్యెల్యే అవ్వడం పెద్ద విషయం కాదు.

కానీ పవన్ అభిమానులు సినిమాల్లో సపోర్ట్ చేసినట్టుగా ఆయన్ని రాజకీయాల్లో సపోర్ట్ చెయ్యడం లేదు. గత పదేళ్లుగా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. పవన్ ని అంతగా అభిమానించే ఫాన్స్ రాజకీయాల్లో ఎందుకు ఎదగనివ్వడం లేదు అని, ఇప్పుడదే మీమ్స్ సోహెల్-పవన్ పిక్స్ పెట్టి మరీ కొంతమంది యాంటీ ఫాన్స్ పైశాచికానందం పొందుతున్నారు.

Is Sohel Pawan the only one?:

Sohel and Pawan memes viral

Tags:   SOHEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ