కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆషిక రంగనాథ్ పేరు.. ఆ చిత్రంతో పెద్దగా వినిపించకపోయినా.. మన్మధుడు నాగార్జున నా సామిరంగా తో గట్టిగా వినిపించింది. సంక్రాంతి కి విడుదలైన నా సామిరంగా ఫ్యామిలీ హిట్ గా నిలవగా.. ఆ చిత్రంలో కింగ్ నాగ్ కి ఎంతగా పేరొచ్చిందో.. హీరోయిన్ ఆషిక పేరు అంత బాగా పాపులర్ అయ్యింది. నాగార్జున తో పోటీ పడి కాదు.. ఆయన కన్నా ఓ మెట్టు ఎక్కవగానే పెరఫార్మెన్స్ చూపించింది అన్నారు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో కాస్త యాక్టీవ్ అయిన ఆషిక తరచూ తన ఫోటో షూట్స్ ని వదులుతూ మత్తెక్కిస్తోంది. ఆషిక రంగనాథ్ గ్లామర్ గా కాదు.. బ్యూటిఫుల్ గా ట్రెడిషనల్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా పర్పుల్ కలర్ మోడ్రెన్ డ్రెస్సులో ఆషిక షేర్ చేసిన ఫోటో షూట్ చూసి యూత్ మైమరిచి పోతున్నారు. కూరలని మొహం మీద పడేలా, ఆ కురుల మధ్యలో ఫేస్ బ్రెట్ గా కనిపిస్తుండగా ఇచ్చిన ఫోజులకి కుర్రకారుకి నిద్ర కరువవ్వడం గ్యారెంటీ. ప్రస్తుతం ఆషిక బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట సంచలనంగా మారాయి.