అనుష్క శెట్టి ని సీనియర్ హీరోలెవరూ కన్సిడర్ చెయ్యడంలేదా.. లేదంటే అనుష్క నే సీనియర్ హీరోలు అవకాశాలు వచ్చినా వదులుకుంటుందా అనేది ఆమె అభిమానుల మదులని తొలిచేస్తున్న ప్రశ్న. బాహుబలి, భాగమతి తర్వాత నిశ్శబ్దంగానే కనిపిస్తున్న అనుష్క శెట్టి బరువు విషయంలో మాత్రం ఆమె లెక్క తప్పింది. సైజ్ జీరో బరువుని తగ్గించుకునేందుకు శతవిధాలా కష్టపడినా ఫలితం సూన్యం. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి అంటూ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో సినిమా చేసినా.. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు.
ఆ సినిమాలోనూ అనుష్క లుక్స్ పై విమర్శలొచ్చాయి. మరి ఈ కటౌట్ కరెక్ట్ గా సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్ గా సూటవుతుంది. వెంకీ, నాగ్, చిరు, బాలయ్య ఇలా ఏ హీరోకైనా అనుష్క సమానమైన జోడి కానీ.. అనుష్కని సీనియర్ హీరోలు తమ సినిమాల్లోకి తీసుకునే ఉద్దేశ్యం లేనట్లుగానే కనబడుతుంది వ్యవహారం. అటు అనుష్క కూడా పెద్దగా అవకాశాల కోసం ట్రై చెయ్యడం లేదు. తన వెంట పడే దర్శకనిర్మాతలకు ఆచి తూచి ఓకె చెబుతుంది. మరి అనుష్క తలచుకుంటే సీనియర్ హీరోల అవకాశాలు ఆమె ఒడిలో వాలడం తధ్యమే.