సంక్రాంతి సినిమాల హడావిడిలో కొట్టుకుపోకుండా అప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని ఈ వారం విడుదల కావడం ఈగల్ కి ప్లస్సా లేదా మైనస్సా అనే విషయంలో చాలామందిలో చాలా ఆలోచనలు నడుస్తున్నాయి. సంక్రాంతి రిలీజ్ ల విషయంలో ఎంత కథ నడిచిందో అందరూ చూసారు. నాలుగు సినిమాలు.. ఎవ్వరూ తగ్గలేదు. చివరికి ఐదో సినిమాగా ఈగల్ వెనక్కి వెళ్ళింది. దాని కోసం ఈగల్ కి పోటీ లేకుండా టాలీవుడ్ చూసుకుంది. యాత్ర 2, లాల్ సలాం ఉన్నా అవి ఈగల్ తో పోటీకి దిగవు. రవితేజ ఈగల్ అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఫిబ్రవరి 9 న విడుదల కావడం దానికి ఎంతవరకు లాభమో అంచనాలు వేస్తున్నారు.
గత వారం విడుదలైన చిన్న సినిమాలేవీ ప్రేక్షకులని ప్రభావితం చేయలేకపోయాయి. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ గట్టిగా సౌండ్ చేసినా అది మొదటి వీకెండ్ వరకే పరిమితమైంది. ఇక ఈగల్ సోలోగానే వస్తున్నట్టే. యాత్ర 2, లాల్ సలాం ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఈగల్ కి ఫిబ్రవరి 9 ఎంతవరకు కలిసొస్తుంది అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. అటు చూస్తే ఓపెనింగ్స్ కూడా ఈగల్ కి సపోర్ట్ చేసేదిలా లేదు. ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ అయినా ఈగల్ టికెట్స్ ఆశించిన విధంగా తెగడం లేదు.
దానితో ఓపెనింగ్ కి తేడా కొట్టేలా ఉంది. రవితేజ క్రేజ్, ఈగల్ పై ఉన్న అంచనాలు బుకింగ్స్ విషయంలో ప్రభావం చూపించడం లేదు. కారణం ఏమి లేదు, పిల్లలు చాలామంది ఎగ్జామ్ ఫీవర్ లో కొట్టుకుంటున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో టీమ్ ఉన్నా.. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఓకె.. లేదంటే ఈగల్ ని ఎవ్వరూ కాపాడలేరు అని మాట్లాడుకుంటున్నారు. సోలో డేట్ ఇచ్చినా ఈగల్ పై ఎందుకో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అవ్వడమే లేదు. రవితేజ సినిమాకి ఇలాంటి పరిస్థితా అనేది ఆయన అభిమానులకి కూడా అర్ధం కావడం లేదు.