సమంత కొద్దినెలలుగా నటనకు దూరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ కోసం నటనకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం స్పెషల్ ఫోటో షూట్స్ తో యాక్టీవ్ గా కనబడుతుంది. ఖుషి, సిటాడెల్ తర్వాత సమంత చేతిలో ఎలాంటి సినిమా లేదు. ఆమె కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్న దాఖలాలు కూడా లేదు. పూర్తిగా హెల్త్ పై కాన్సంట్రేట్ చేసిన సమంత త్వరలోనే తెలుగు చిత్రంలో నటించబోతుందా..
అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్రంలో సమంత నటించనుంది అని, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చెయ్యబోయే చిత్రంలోనే సమంత నటించనుంది అంటున్నారు. కానీ ఖుషి చిత్రంలో సమంత లుక్స్ విషయంలో వినిపించిన్విమర్శలకు అసలు ఆమెకి స్టార్ ఛాన్సెస్ వస్తాయా అనే అనుమానం చాలామందిలో ఉంది. అందులోను రామ్ చరణ్ తో సమంతకి ఛాన్స్ వచ్చింది అనేది జస్ట్ రూమర్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.