Advertisementt

జాన్వీ కపూర్ ఖాతాలో మరో సౌత్ సినిమా

Wed 07th Feb 2024 01:03 PM
janhvi kapoor  జాన్వీ కపూర్ ఖాతాలో మరో సౌత్ సినిమా
Janhvi Kapoor enters another crazy project జాన్వీ కపూర్ ఖాతాలో మరో సౌత్ సినిమా
Advertisement
Ads by CJ

అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మెల్లగా సౌత్ లో పాగా వెయ్యడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ, మహేష్ చిత్రాలతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అనే ప్రచారం జరిగినా ఫైనల్ గా జాన్వీ కపూర్ మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర ప్యాన్ ఇండియా మూవీతో సౌత్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో జాన్వీ కపూర్ కొత్తగా కనిపించనుంది. ఇక ఈ చిత్రం తర్వాత జాన్వీ కపూర్ తదుపరి సౌత్ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ కి మరో సౌత్ ఆఫర్ అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో సరసన అవకాశం వచ్చింది అంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చి బాబు కాంబోలో మొదలు కాబోయే RC16 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైన్ చేసింది అని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కి ఛాన్స్ వచ్చింది, జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని తెలుస్తోంది. 

మరి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ పై ఎన్ని ఊహాగానాలు నడిచినా ఫైనల్ గా ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టేటస్ అందుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఛాన్స్ దొరికించుకుని క్రేజీగా మారింది.

Janhvi Kapoor enters another crazy project:

Janhvi Kapoor to romance Global Star Ram Charan

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ