Advertisementt

రాజకీయాల్లోకి మరో హీరో

Wed 07th Feb 2024 12:18 PM
vishal  రాజకీయాల్లోకి మరో హీరో
Vishal on starting his own party రాజకీయాల్లోకి మరో హీరో
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కొలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికర విషయం నడుస్తుంది. అది టాప్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవడమే తరువాయి.. కొత్త పార్టీ పేరు తమిళగ వెట్రి కజగంగా ప్రకటించి సర్ ప్రైజ్ చేసారు. ప్రస్తుతం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో విజయ్ పార్టీ హాట్ టాపిక్ గా మారిన వేళ మరో కోలీవుడ్ హీరో తమిళ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతనెవరో కాదు ఎప్పుడూ కాంట్రవర్సీలకి కేరాఫ్ గా ఉండే హీరో విశాల్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా టాక్.

గతంలో హీరో విశాల్ వైస్సార్సీపీ తరుపున చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయబోతున్నాడనే ప్రచారం జరిగింది. విశాల్ అప్పట్లో తనకి ఏపీ రాజకీయాలపై అంతగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీకి విశాల్ రెడీ అవుతున్నారని అంటున్నారు. మక్కల్‌ నల ఇయక్కం పేరుతొ సేవ కార్యక్రమాలు చేస్తున్న విశాల్ ఇతర ప్రాంతాలకు షూటింగ్‌ లకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సాయం చేస్తూ అందరూ తన గురించి మట్లాడుకునేలా చేస్తున్నాడు. అభిమాన సంఘాల పేరిట ఏర్పాటు చేసిన విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం ని చెన్నై కి పిలిపించి మీటింగ్ పెట్టి పొలిటికల్ ఎంట్రీపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఈ విషయంలో విశాల్ చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాడని.. మక్కల్‌ నల ఇయక్కం తో మీటింగ్ పూర్తయ్యాక విశాల్ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. మరి స్టార్ హీరో విజయ్, ఇటు హీరో విశాల్ ఈ ఎన్నికల్లో కొత్త పార్టీలతో ఎలాంటి ప్రభావం చూపబోతున్నారో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి. 

Vishal on starting his own party:

Is Vishal staring his own party

Tags:   VISHAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ