ఈ శుక్రవారం విడుదలకు సిద్దమైన రవితేజ ఈగల్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సంక్రాంతి సినిమాల మధ్యలో నలిగిపోవడం ఇష్టం లేని నిర్మాత విశ్వప్రసాద్ సోలో డేట్ అంటూ ఫిబ్రవరి 9 న రిలీజ్ కి సిద్ధం చేసారు. ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రమోషన్స్ తో విడుదలకి సిద్దమైన ఈగల్ మూవీ ని తాజాగా రవితేజ అండ్ టీమ్ వీక్షించారు. సినిమా చూసాక రవితేజ ఈగల్ పై ఇలా స్పందించారు. తానే ఈ చిత్రానికి మొదటి ప్రేక్షకుడుగా మారి ఈగల్ ఫస్ట్ రివ్యూ అందించారు. సినిమా మొత్తం చూసి సూపర్ సాటిస్ఫైడ్ అంటూ ఆసక్తికరంగా రవితేజ స్పందన ఉంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కమర్షియల్ అంశాలతో పాటు రైతులకు సంబంధించిన ఓ కీలక సమస్యకు కొత్త తరహా ట్రీట్ మెంట్ ఉండబోతుంది అనే టాక్ ఉంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రేపు శుక్రవారం గ్రాండ్ గా విడుదలకాబోతుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టాలనే ఆలోచనతో మేకర్స్, రవితేజ, హీరోయిన్స్ అంతా ప్రమోషన్స్ ని చేస్తూ ఈగల్ పై అంచనాలు పెంచే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఈగల్ పై ఫస్ట్ రివ్యూ గా రవితేజ స్పందించడం చూసాక అందరిలో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది.