Advertisementt

ఇది వింటే ప్రభాస్ ఫాన్స్ కి పండగే

Tue 06th Feb 2024 11:48 AM
prabhas,raja saab  ఇది వింటే ప్రభాస్ ఫాన్స్ కి పండగే
Prabhas fans will be delighted to hear this ఇది వింటే ప్రభాస్ ఫాన్స్ కి పండగే
Advertisement
Ads by CJ

సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రభాస్ ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్లాప్ అవడంతో డిస్పాయింట్ అయిన ప్రభాస్ అభిమానులు సలార్ హిట్ తో వాటిని మర్చిపోయారు. ఇకపై రాబోయే కల్కి, రాజా సాబ్ పై అంతకు మించిన అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లుక్ ని పొంగల్ కి వదిలారు. ఆ పోస్టర్ వచ్చేవరకు మారుతి పై ప్రభాస్ అభిమానులు యుద్ధం చేసారు. కానీ ఒక్క పోస్టర్, టైటిల్ తో అనుమానాలు తొలిగిపోయాయి. 

అయితే తాజా సమాచారం ప్రకారం కథ మొత్తం ఒక ప్యాలస్ లోనే జరుగుతుంది అని.. ఆ ప్యాలస్ జమీందారు వారసుడిగా ప్రభాస్ పాత్ర ఉంటుందంట. ఈ చిత్రంలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయంట. 4 సాంగ్స్ ని థమన్ డిజైన్ చేస్తున్నాడంట. అందులో ఒకటి స్పెషల్ సాంగ్, మూడు సాంగ్స్ హీరోయిన్స్ తో డ్యూయెట్స్ ఉండబోతున్నాయట. ఇప్పటికే థమన్ రెండు సాంగ్స్ ని కంపోజ్ చేసి ఇచ్చేశాడంటూ టాక్. 

ప్రస్తుతం ప్రభాస్ కల్కి ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇక త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతోంది అని సమాచారం. ఈ ఏడాది ఆఖరులో కానీ  సంక్రాంతి రేసులో కానీ రాజా సాబ్ మూవీ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారు. మరి మే 9 న కల్కి, డిసెంబర్ లో రాజా సాబ్ వస్తే ప్రభాస్ ఫాన్స్ కి సంబరాలు కాక ఇంకేంటి.

Prabhas fans will be delighted to hear this:

Prabhas Raja Saab update

Tags:   PRABHAS, RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ