Advertisementt

రేవంత్‌ను టచ్ చేసే దమ్ము జగన్‌కు ఉందా..

Tue 06th Feb 2024 09:55 AM
ycp  రేవంత్‌ను టచ్ చేసే దమ్ము జగన్‌కు ఉందా..
Does Jagan have the guts to touch Revanth? రేవంత్‌ను టచ్ చేసే దమ్ము జగన్‌కు ఉందా..
Advertisement
Ads by CJ

ఏదో సినిమాలో ప్రకాష్ వీడు మామూలోడు కాదు.. వీడు మామూలోడు కాదు అంటూ చెప్పిన మాటనే పలు మార్లు వల్లె వేస్తారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇలానే అనుకుంటూ ఉండి ఉండొచ్చు. నిజమే రేవంత్ మామూలోడు కాదు కాబట్టి జగన్‌ను దగ్గరకు కూడా రానీయలేదు. జగన్‌కు రాచమర్యాదలు.. ఆయనతో కలిసి కూర్చొని స్కెచ్‌లు గీయడం వంటివి చేయడానికి ఆయనేమీ కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన సీఎం జగన్‌కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. 

వైసీపీ నేతలు సైలెంట్‌గా ఎందుకు ఉండిపోయారు?

ఆసక్తికర విషయం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు కానీ వేరే ఇతర నేతలు ఏమైనా సీఎం జగన్‌ను విమర్శిస్తే చాలు.. అంతెత్తున లేస్తారు వైసీపీ నేతలు.. కానీ రేవంత్ ఓ రేంజ్‌లో దునుమాడితే కిమ్మనకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. అసలు రేవంత్ అంతలా ఫైర్ అవడానికి కారణమేంటి? అంతలా ఫైర్ అయినా కూడా వైసీపీ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు సరిగ్గా కొన్ని గంటల ముందు జగన్ తమ పోలీసులతో నాగార్జున సాగర్‌ను కబ్జా చేసేసి పెద్ద ఎత్తున గలాటా అయితే సృష్టించారు. దీంతో సాధించిందేమీ లేదు కానీ కేవలం అప్పటి సీఎం కేసీఆర్‌కు సపోర్టింగ్‌గానే జగన్ అలా చేశారని టాక్ నడిచింది.

ఇకపై రేవంత్‌తో జగన్‌కు తలనొప్పేనా..?

ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలనే అలా చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై రేవంత్ తాజాగా జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు కాదు ఇప్పుడు రా నాగార్జున సాగర్‌కు అని రేవంత్ పదే పదే నొక్కి చెప్పారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని.. దమ్ముంటే టచ్ చేసి చూడు అని రేవంత్ సవాల్ విసిరారు. ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసినా కూడా వైసీపీ నేతలు నోరు మెదపలేదు. జగన్‌పై ఈగ వాలినా సరే ఒంటి కాలిపై లేచే ఏపీ మంత్రులు, బూతు నేతలు మిన్నకుండిపోయారు. ఇప్పటి వరకూ రేవంత్ గురించి.. ప్రస్తుత, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేసిన వారే. కానీ ఇప్పుడు కనీసం స్పందించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రేవంత్ కామెంట్స్‌తో వైసీపీ నేతలు దడుసుకున్నారా..? విభజన తర్వాత పంచుకోవాల్సినవి అన్నీ ఇక పెండింగ్‌లో పడినట్లేనా..? కృష్ణా జలాల పంపకం, ఇకపై ఏమున్నా రేవంత్‌తో జగన్‌కు తలనొప్పేనా..? అనే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి.

Does Jagan have the guts to touch Revanth?:

Why did the YCP leaders remain silent..

Tags:   YCP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ