Advertisementt

పవన్‌ను ఏకిపారేసిన హరి రామజోగయ్య!

Mon 05th Feb 2024 09:08 PM
hari rama jogaiah  పవన్‌ను ఏకిపారేసిన హరి రామజోగయ్య!
Jogaiah Writes Open Letter To Pawan Kalyan పవన్‌ను ఏకిపారేసిన హరి రామజోగయ్య!
Advertisement
Ads by CJ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య ఘాటు లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని.. ఆయన గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదన్నారు. ముఖ్యంగా సీట్ల పంపకంపై పలు ప్రశ్నలు హరిరామ జోగయ్య లేవనెత్తారు. సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా కాపాడతావంటూ పవన్‌ను ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని నిలదీశారు. చంద్రబాబును సీఎంను చేయడం కోసం పవన్ వెంట కాపులు నడవాలా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు పవన్‌ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్‌ చేశారు. 

2019 ఫలితాలే దానికి ఉదాహరణ..

జనసేనకు 27 నుంచి 30 సీట్లు వస్తాయని ఏకపక్షమైన ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నప్పుడు ఎవరిని ఉద్ధరించడానికని పొత్తు అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. పార్టీ శ్రేణులంతా ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదన్నారు. జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. దీనికి 2019 ఫలితాలే ఉదాహరణ అని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

175 సీట్లు ఉన్న రాష్ట్రంలో జనసేన కనీసం 50 సీట్లలోనైనా పోటీ చేసే అవకాశం దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందనే నమ్మకం వస్తుందని హరి రామ జోగయ్య తెలిపారు. కాబట్టి తప్పకుండా 40 నుంచి 60 సీట్లలో పోటీ చేసి తీరాలన్నారు. 

చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా?

అధికారం అంతా చంద్రబాబుకే ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్ కల్యాణ్‌ను హరిరామ జోగయ్య సూటిగా ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా  కట్టబెడతానని చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా? అని జోగయ్య లేఖ ద్వారా పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ గతంలోనూ ఇలాంటి లేఖలు చాలా వచ్చాయి. ఆ తర్వాత హరిరామ జోగయ్య ఆసక్తికరంగా ఆ లేఖలు తాను రాయలేదన్నారు. తన పేరిట ఎవరో రాస్తున్నారంటూ సంచలనానికి తెరదీశారు. మరి ఈ లేఖ కూడా ఆ తరహా లేఖేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Jogaiah Writes Open Letter To Pawan Kalyan:

Hari Rama Jogaiah wrote open letter to Janasena chief Pawan Kalyan

Tags:   HARI RAMA JOGAIAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ