కొన్నాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న నటి శృతి హాసన్ ఇప్పుడు బాగా యాక్టీవ్ అయ్యింది. క్రాక్ కి ముందు కొద్దిరోజులు సైలెంట్ గా సినిమాలకి దూరమైన శృతిహాసన్ క్రాక్ తో ట్రాక్ లోకి వచ్చేసింది. గత ఏడాది వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి రెండూ హిట్స్, సలార్ సూపర్ హిట్ అవడంతో శృతి హాసన్ క్రేజ్ బాగా పెరిగింది. సలార్ 2 లో నటించాల్సిన శృతి హాసన్ ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యింది. అందులో ఒకటి లారెన్స్-రమేష్ వర్మ చిత్రంలో శృతి హాసన్ కి ఛాన్స్ వచ్చింది అనే టాక్ నడుస్తుంది.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కి చోటు ఉంటుంది అని.. అందులో ఒకటి నయనతార మరొకరు శృతి హాసన్ అని అంటున్నారు. మరోపక్క మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తున్నా శృతి హాసన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అనే వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో తరచూ ఫొటోస్ షేర్ చేసే శృతి హాసన్ తాజాగా కొత్త లుక్ ని షేర్ చేసింది. లైట్ గ్రీన్ మోడ్రెన్ డ్రెస్సులో కొత్తగా కనిపించింది. లూజ్ హెయిర్, చెవులకి పెద్ద పెద్ద జుంకాలతో శృతి న్యూ లుక్ వైరల్ గా మారింది.