సీఎం రేవంత్ రెడ్డితో రామ్ చరణ్ చెయ్యి కలిపిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిక్ మెగాస్టార్ ఇంట జరిగిన పార్టీలో తీసింది. ఆ పార్టీకి తెలంగాణ సీఎం రేవంత్ హాజరయ్యారు. చిరుకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన కోడలు ఉపాసన ఈ పార్టీని ఆరెంజ్ చేసారు. అక్కడ మెగాస్టార్ చిరు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలు ఆప్యాయంగా రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. మెగాస్టార్ ని శాలువాతో సత్కరించిన రేవంత్ రెడ్డి రామ్ చరణ్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించడంతో.. రామ్ చరణ్ తెలంగాణ సీఎం తో చెయ్యి కలిపాడు అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ ఇంట ఉపాసన హోస్ట్ చేసిన పార్టీకి కింగ్ నాగార్జున ఆయన భార్య అమలతో హాజరు కాగా.. దర్శకుడు సుకుమార్ ఆయన భార్య.. ఇలా ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరైనట్టుగా బయటికొచ్చిన పిక్స్, వీడియోస్ చూసి వాళ్ళ అభిమానులు ముచ్చటపడిపోతున్నారు.