పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అందులోను టీడీపీ తో పొత్తు విషయంలో ఆలోచన చేస్తున్నారా.. టీడీపీ తో పొత్తు ని విరమించుకోవడానికి సిద్దమయ్యారా.. అంటే నిజమే అనేలా ఆయన ప్రవర్తన కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సోలోగానే ఎన్నికల బరిలో నిలవాలని డిసైడ్ అయినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. టీడీపీ తమని సంప్రదించకుండా అభ్యర్దులని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా వ్యంగ్యంగా రెండు సీట్ల ని ప్రకటించారు. దానితో జనసేన-టీడీపీ పొత్తు విచ్ఛిన్నంపై ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.
మరోపక్క బ్లూ మీడియా జనసేన-టీడీపీ విచ్చినం అంటూ పండగ చేసుకుంటుంది. పొత్తుపై జనసేనాని మౌనం.. కేడర్ లో టెన్షన్, పవన్ ఏదో ఒకటి తేల్చవయ్యా అంటూ సణుగుడు మొదలు పెట్టిన జనసైనికులు అంటూ బ్లూ మీడియా భూతద్దం పెట్టి వారి పొత్తు సమసిపోయింది అనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో ఇకపై టీడీపీ, వైసీపీ ఎవ్వరితో పొత్తు పెట్టుకోవడం లేదు.. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినట్టుగా పలు ఛానల్స్ లో న్యూస్ మొదలయ్యింది.
మరి సీట్ల పంపకంలో టీడీపీతో జనసేనానికి పొసగనందునే వీరి పొత్తుపై ఇప్పుడు సమస్య మొదలైంది అని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరయ్యే సమయానికి జనసేన-టీడీపీ ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారా.. ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. పవన్ ఒంటరి పోరాటనికి సిద్దమైనట్లేనా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.