నిన్న శనివారం దెందులూరులో వైస్సార్సీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సిద్ధం అంటూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ కోసం రాష్ట్రంలోని APSRTC బస్సులని వాడేశారు. జనాలని తరలించేందుకు ఈ బస్సులని వాడగా.. పలువురు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అదలా ఉంటే.. సిద్ధం సభ కి ఏర్పాటు చేసిన వేదికపైకి జగన్ రాకముందే కొంతమంది యువకులు స్టేజ్ ఎక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసారు. వారిని అదుపు చేసేందుకు జగన్ సెక్యూరిటీ, మిగతా పోలీసులు నానా అగచాట్లు పడ్డారు.
అయితే ఆ కుర్రాళ్ళు జగన్ ని కొట్టడానికి వచ్చారా.. లేదంటే జగన్ ని కలిసి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారా అనేది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా వింగ్స్ ఎవరికి ఇష్టం వచ్చిన రాతలు వాళ్ళు రాసుకుంటున్నారు.
వైస్సార్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్ లో..
ప్యాకేజీ తీసుకుని వచ్చే నాయకులు కాదు…
బిర్యాని ప్యాకెట్ ఇస్తే వచ్చే పచ్చ బ్యాచ్ కాదు…
అసలు సిసలైన జగనన్న అభిమానులు…🔥
Die hard fans of
@ysjagan
anna ♥️🙌🏻 అంతో ఆ వీడియోని పోస్ట్ చేసారు.
ఇక చంద్రబాబు అభిమానులు..
జగన్ ని కొట్టటానికి ఎగబడుతున్న సొంత పార్టీ కుర్రోళ్లు.. దేబిరి మొహం పెట్టుకుని దండాలు పెడుతూ పారిపోయిన జగన్
అలాగే పవన్ అభిమానులు
మీరు మీ పార్టీలానే లుచ్చాగాళ్ళని తెలుసు గానీ, మరీ ఇంత లోఫర్ గాళ్ళని అనుకోలేదురా బాబు 🤭
అక్కడున్న ప్రతీ బస్సూ స్కూల్ యాజమాన్యాలను బెదిరించి ఎత్తుకెళ్ళిందే & అక్కడికొచ్చిన ప్రతి ఒక్కడూ ప్రలోభ పెడితేనో భయపెడతేనో వచ్చినోడే! నిజాలను దాచి ఇట్టా ఫేక్ ఫోటోలు షేర్ చేస్తే ఎవడ్రా నమ్మేది? అటూ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు పోస్ట్ లు పెట్టుకుంటూ పండగ చేసుకుంటున్నారు.