మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ తర్వాత ఓ పార్టీ చేసుకున్న తర్వాత కూల్ గా జర్మనీ వెళ్లిపోయారు. జర్మనీ లో ఆయన వెకేషన్స్ ఎంజాయ్ చెయ్యడానికి వెళ్ళలేదు, రాజమౌళి తో మొదలు పెట్టబోయే SSMB29 చిత్రం కోసం లుక్ మార్చేందుకు వెళ్లారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్స్ తెలుసుకునేందుకే జర్మనీ వెళ్లారన్నారు. అసలు మహేష్ ఎందుకు జర్మనీ వెళ్లారో అనేది ఇప్పడు రివీలైంది.
రాజమౌళి సినిమా లో కొత్త లుక్ కోసమే ఆయన జర్మనీ వెళ్లారని తేలిపోయింది. ఈరోజు ఉదయమే మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మహేష్ చిన్నపాటి గెడ్డం లుక్ లో హెయిర్ స్టయిల్ కనిపించకుండా క్యాప్ తో దాచేసి, కళ్ళకి బ్లాక్ కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని స్టయిల్ గా కనిపించారు. మహేష్ క్యాజువల్ గా మ్యాన్లిగా కనిపించినా ఆయన లోని కొత్త యాంగిల్.. మాత్రం అభిమానులకి కిక్కిచ్చింది.
మరి మహేష్-రాజమౌళి మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటిలో మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు, రాజమౌళి తదుపరి మూవీపై హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు.