పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ స్థాపించి కొద్దిరోజులు సినిమాలకి విరామం ప్రకటించారు. అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనుకున్నంతగా సక్సెస్ అవ్వకపోవడంతో ఆయన తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అవకాశం ఉన్నప్పుడు రాజకీయాలు, లేదంటే సినిమా షూటింగ్స్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్ళు వేసి తీరానికి చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ చేయబోతున్నాడా అంటే అది అభిమానులకి ఇంకా క్లారిటీ రావడం లేదు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిన్న శుక్రవారం పార్టీని ప్రకటించాడు. వరస సినిమాలతో ఫుల్ క్రేజ్ ఉన్న విజయ్ ఎన్నాళ్ళ నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజలకి దగ్గరవుతూ.. ఫైనల్ గా కొత్త పార్టీని ఎనౌన్స్ చేసాడు. సినిమా స్టార్స్ ఇలా పార్టీలని పెట్టడం.. వర్కౌట్ అయితే ఓకె.. లేదంటే సినిమాలు చేసుకోవడం అనేది చూస్తున్నట్టుగానే.. విజయ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెడతాడా.. లేదంటే సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలు చేస్తాడా.. అనే అనుమానం అందరిలో ఉంటే.. ఆయన అభిమానుల్లో మాత్రం విజయ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెడితే ఎలా అనే ఆందోళన కనబడుతుంది.
విజయ్ సినిమాలని, రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తాడా అని అందరిలో ఆసక్తి కనిపిస్తుంది. అటు పవన్ ఫాన్స్ కూడా పవన్ ని సినిమాల్లోకి రావాలని చాలా డిమాండ్ చేసారు. ఇప్పుడు విజయ్ అభిమానుల పరిస్థితి కూడా అలానే కనబడుతుంది.