నా సినిమా చూడండి అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహెల్ సినిమాని ప్రేక్షకులు చూసారా.. అంటే చూసారమేమో అనేలా సోషల్ మీడియాలో సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు ట్రెండ్ అవుతుంది. బిగ్ బాస్ లో సోహెల్ ని ఆదరించారు, ఇప్పుడు చూస్తే తాను నటించిన సినిమాని థియేటర్స్ కి వచ్చి ఎవ్వరూ చూడడం లేదు అంటూ సోహెల్ కన్నీరు మున్నీరు ఆయ్యాడు. సోహెల్ అలా తన సినిమా చూడమని కన్నీళ్లు పెట్టుకోవడం అతనికి ఎంతో కొంత వర్కౌట్ అయ్యింది అనే అనిపిస్తుంది.
సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమాను శుక్రవారం రోజు అంటే ఫిబ్రవరి 2వ తేదీ థియేటర్లలో విడుదల చేశారు. పెద్దగా ప్రమోషన్స్ కూడా లేని ఈ సినిమాని చూసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. దానితో సోహెల్ డల్ ఆయ్యాడు. నిన్న ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడాలని థియేటర్ కు వెళ్లిన సోహెల్ కి అక్కడ ఎక్కువ మంది ప్రేక్షకులు కనిపించలేదు. అంతే సోహెల్ చాలా ఎమోషనల్ అవుతూ.. కంటతడి పెట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి బూట్ కట్ బాలరాజు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ X లో ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఇక సోహెల్ వీడియో చూసిన పలువురు రకరకాలుగా స్పందించడం, బాట్ కట్ బాలరాజు గురించి మాట్లాడుకోవడం కాస్త హెల్ప్ అయ్యింది అనిపించింది, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ సోహెల్ కి ఫోన్ చేసి నువ్వేం చేసావో తెలియదు కానీ.. థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తున్నారు, పికప్ అయ్యింది అని చెప్పారంటూ సోహెల్ మరో వీడియో ని సోషల్ మీడియాలో వదిలాడు. తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. మీ సపోర్ట్ వల్లే ఇప్పుడే సినిమా కాస్తు పుంజుకుంటుందని, ప్రస్తుతం తనకు చాలా సంతోషంగా ఉందని, తాను నిన్న అలా ఎమోషనల్ అవ్వడం సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పుకొచ్చాడు.