బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ ఆర్టిస్ట్ ప్రియాంక జైన్.. ప్రస్తుతం ఆమె బాయ్ ఫ్రెండ్ శివ తో కలిసి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. ఆమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు నుంచే శివ తో కలసి ఉంటుంది. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చాక శివ - ప్రియాంక వివాహం చేసుకుంటారని అందరూ భావించారు. కానీ వారు ఇద్దరూ వీడియోస్ చేస్తూ బిజీగా కనిపిస్తున్నారు తప్ప పెళ్లి పేరు ఎత్తడం లేదు. ప్రియాంక-శివ కలిసి ఓ సీరియల్ లో నటించినప్పుడు వీరి మధ్యన ప్రేమ చిగురించింది. అయితే బిగ్ బాస్ లో టాప్ 5 నుంచి బయటికి వచ్చిన ప్రియాంక ఇకపై శివతో ఏడడుగులు వేస్తుంది అనుకున్నారు.
అయితే ప్రియాంక-శివ లైనింగ్ రిలేషన్ పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. దానితో ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ ఈ పెళ్లి, లివింగ్ రిలేషన్ పై స్పందించాడు. పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అందులోను ప్రియాంక గ్రాండ్ గా కొద్దిరోజులపాటు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. దానికి చాలా ఖర్చవుతుంది. ప్రస్తుతం అంత డబ్బు మా దగ్గర లేదు. అందుకే మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. ఇందుకు మా కుటుంభ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. మేము కలిసి ఉంటున్నా, మా పేరెంట్స్ ఏం అనడం లేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ కామెంట్స్ కి సమాధానం చెప్పేందుకు ఒకానొక సమయంలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుందాము అనుకున్నాము. కానీ దాన్ని తర్వాత విరమించుకున్నాము, ప్రస్తుతం కలిసే ఉంటున్నాము అంటూ శివ చెప్పుకొచ్చాడు. మరి ఇలా అయితే ప్రియాంక-శివ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కంపించడం లేదు.