పెళ్లి తర్వాత మెగా కోడలుగా అడుగుపెట్టాక లావణ్య త్రిపాఠి ఇకపై నటన కు దగ్గరగా ఉంటుందా.. లేదంటే నటిస్తుందా.. అని అందరిలో ఎంతో ఆసక్తి నడుస్తుంది. ఆమె మెగా కోడలుగా బాధ్యతలు స్వీకరించాక నటనకు గుడ్ బై చెబుతుంది అని కొందరు, ఆమె నటిస్తుంది, పెళ్లి తర్వాత ఆమె కెరీర్ లో ఎలాంటి మార్పు ఉండదు అని మరికొందరు అంటున్నారు. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి మరదలు నిహారిక.. మేము నటులం, పెళ్లి తర్వాత నటనకు ఎందుకు దూరమవుతాం అంటూ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సీరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి విడుదలైంది. ఈ సీరీస్ ఈరోజు శనివారం నుచి స్ట్రీమింగ్ అవుతుండగా.. లావణ్య దీని ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడింది. ఈ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠిని మీరు నటనను కంటిన్యూ చేస్తారా అని అడగ్గానే.. మెగా కోడలిగా అడుగుపెట్టినా.. నా కెరీర్ లో ఎలాంటి మార్పు ఉండదు, మెగా కోడలిగా బాధ్యతలు తీసుకున్నావు, నువ్వు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని ఎవరూ పరిమితులు పెట్టలేదు.
నాకు కెరీర్ పరంగా ఆ కుటుంబంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంది, అన్నిటికి మించి అర్ధం చేసుకునే వరుణ్ నాకు భర్తగా దొరికాడు. మేము ఎప్పటిలాగే ఉన్నాము, వరుణ్ నా సినిమాల గురించి పట్టించుకోడు, నేను ఏమైనా చెబితే వింటాడు, నాకు అంతకుమించి ఏం కావాలి అంటూ లావణ్య చెప్పుకొచ్చింది.