పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG అంటూ వర్కింగ్ టైటిల్ తో దర్శకుడు సుజిత్ మొదలు పెట్టిన సినిమా షూటింగ్ కి పవన్ రాజకీయ కారణాలతో ప్రస్తుతం బిగ్ బ్రేక్ ఇచ్చారు. దానయ్య నిర్మాతగా ప్యాన్ ఇండియా మూవీగా OG ని తెరకెక్కిస్తున్నారు. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తారని అదే టైటిల్ ఈ చిత్రానికి ఉంచేస్తారని, OG అంటే ప్యాన్ ఇండియా భాషలకి బాగా రీచ్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు దానయ్య OG కోసం మరో పవర్ ఫుల్ టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న థమన్ హంగ్రీ చీతా అంటూ టైటిల్ ట్రాక్ ఫిక్స్ చేసాడు. ఏపీ లో ఎలక్షన్స్ మూమెంట్ లేకపోతె ఈ టైటిల్ ట్రాక్ ఎప్పుడో విడుదలయ్యేది. అయితే ఇప్పుడు అదే హంగ్రీ చీతా ఈ చిత్రం టైటిల్ గా ఫిక్స్ చేసారని బజ్. ఆ సాంగ్ లోని హంగ్రీ చీతా లైన్ నే మేకర్స్ సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేయించారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి OG కి ఈ టైటిల్ ని దానయ్య రిజిస్టర్ చేయించాడంటూ పవన్ ఫాన్స్ ఆ టైటిల్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సందడి చేస్తున్నారు.