సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో డాన్స్ కుమ్మేసారు. ఇంతవరకు మహేష్ నుంచి రాని స్టెప్స్ గుంటూరు కారం సాంగ్స్ లో కనిపించాయి. అద్భుతమైన డాన్సర్ శ్రీలీల తో సమానంగా మహేష్ వేసిన కుర్చీ మడతబెట్టి సాంగ్ డాన్స్ స్టెప్స్ వైరల్ అయ్యింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా గుంటూరు కారం లో డాన్స్ లు మాత్రం బాగా హైలెట్ అయ్యి అందరూ మాట్లాడుకునేలా చేసాయి. అయితే ఇప్పుడు గుంటూరు కారంలోని ధమ్ మసాలా సాంగ్ కి మహేష్ తనయ సితార డాన్స్ కుమ్మేసింది.
సితార మహేష్ నటించిన చాలా సినిమాల పాటలకి ఇలా డాన్స్ తో దుమ్మురేపిందిది. యాని మాస్టర్ ట్రైన్ చెయ్యగా.. సితార డాన్స్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుని మరీ చేస్తుంది. ధమ్ మసాలా సాంగ్ కి సితార లుంగీ కట్టి మరీ కేక పెట్టించే స్టెప్స్ తో అదరగొట్టేయ్యగా.. సితార డాన్స్ వీడియో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కురిపిస్తుంది. గుంటూరు కారం హీరోయిన్ శ్రీలీలకి సితార తీసిపోకుండా వేసిన డాన్స్ తో ఘట్టమనేని అభిమానులు మురిసిపోతున్నారు.