Advertisementt

అడ్డొస్తే చెల్లెళ్లనూ చంపేస్తారా..

Fri 02nd Feb 2024 09:47 PM
jagan  అడ్డొస్తే చెల్లెళ్లనూ చంపేస్తారా..
Will Jagan kill his sisters if he gets in the way? అడ్డొస్తే చెల్లెళ్లనూ చంపేస్తారా..
Advertisement
Ads by CJ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యుల చేతిలోనే హతమైన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె సునీత మొదట్లో తన తండ్రిని ఎవరో హత్య చేశారని అనుకున్నప్పటికీ ఆ తరువాత చంపేసింది తనవారేనని తెలిసి తల్లడిల్లిపోయారు. ఆపై తండ్రి చావుకు న్యాయం జరిగేలా చూడాలని డిసైడ్ అయిపోయి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. కొన్ని నెలలుగా ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా సరే.. ఆమెకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఇటీవల సీఎం వైఎస్ జగన్ సొంత చెల్లి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌తో షర్మిల భేటీ అయ్యారు. దీంతో వారిద్దరూ జగన్‌కు వ్యతిరేకంగా పని చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

లేపేస్తామంటూ పోస్టులు..

మరి ఈ వార్తలను బేస్ చేసుకున్నారో.. మరొకటో కానీ సునీతారెడ్డి చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులతో పాటు తనను, వైఎస్ షర్మిలను లేపేస్తాం అనే విధంగా బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో సునీతారెడ్డి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాను మాత్రం వ్యక్తిగత జీవితాన్నే గడుపుతున్నానని సునీతారెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో తన పైన, తన సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని వెల్లడించారు. ఆ పోస్టులన్నీ కూడా అభ్యంతరకరంగానూ.. అసహ్యంగానూ ఉంటున్నాయని వెల్లడించారు. 

ఎవరినైనా లేపేస్తారా?

వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్ పేజీ పరిశీలించినా కూడా తనపై, షర్మిలపై ఎలాంటి అవమానకర పోస్టులు పెట్టాడో తెలుస్తుందన్నారు. తమ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు ఉన్నాయని సునీతా రెడ్డి తెలిపారు. షర్మిలతో భేటీ తర్వాతే తనను చంపేయాలనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడని ఫిర్యాదులో ఆమె తెలిపారు. పెద్దలు శత్రుశేషం ఉండకూడదని లేపేయ్ అన్నారు అన్నాయ్.. ఇద్దరినీ లేపేయ్ ఈ ఎన్నికలకు పనికి వస్తారని రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని సునీత తెలిపారు. అంటే వివేకాను అందరికీ తెలిసే హతమార్చినట్టు కదా. ఎన్నికలకు పనికొస్తారు అనుకుంటే  ఎవరినైనా లేపేస్తారా? ఈ రకంగా చూస్తే షర్మిలకు కూడా ప్రాణహాని ఉన్నట్టే కదా. చివరకు రవీందర్ రెడ్డి ఫేసుబుక్‌లో జగన్ మాతృమూర్తి విజయమ్మను కించపరుస్తూ కూడా పోస్టులు ఉన్నాయని సునీత తెలిపారు. ఇంత దారుణం మరొకటి ఉంటుందా? మీకు అడ్డొస్తున్నారంటే తల్లి, చెల్లెళ్లను ఎవరినీ వదలరా? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.

Will Jagan kill his sisters if he gets in the way?:

Jagan vs sisters

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ