మంత్రి అయ్యాక రోజా మైలేజ్ పెరుగుతుంది అనుకుంటే.. అసలుకే మోసం వచ్చేటట్టుగా ఉంది. అసలు నగరి టికెట్ ఈసారి రోజాకి వస్తుందా.. అనే కన్ఫ్యూజన్ లో నగరి ప్రజలే కనిపిస్తున్నారు. మరోపక్క రోజా పెరఫార్మెన్స్ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో కనిపించడం, జగన్ కి రోజా పై నెగెటివ్ సంకేతాలు అందడంతో ఈసారి రోజాకి ఎమ్యెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. ప్రతి సర్వేలో రోజా పై రోజు రోజుకి పెరుగుతున్న వ్యతిరేఖత అంటూ ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. చాలామంది ఈసారి రోజాకి టికెట్ వచ్చే ఛాన్స్ లేదు అని ఫిక్స్ అవుతున్నారు.
కానీ రోజా మాత్రం తన సేవలే మనకి టికెట్ ని ఇప్పిస్తాయంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. ఈరోజు శుక్రవారం రోజా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లగా.. అక్కడ అమరావతి మహిళలు రోజాకి చుక్కలు చూపించారు. తర్వాత రోజా మీడియాతో మట్లాడుతూ ఈసారి నగరి టికెట్ తనకే వస్తుంది అని ధీమా వ్యక్తం చెయ్యడమే కాదు.. హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోబోతున్నట్టుగా చెప్పడం చూసి ఏం కాన్ఫిడెన్స్ రోజమ్మా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసేలా చేసింది. నగరి నుంచి గెలిచి జగన్ అన్నకి తన విజయాన్ని కానుకగా ఇస్తా అంటూ చెప్పుకొచ్చింది.
మరి మంత్రి అయ్యాక ప్రజా సేవ ఏమో కానీ ఆమె వారం వారం శ్రీవారి సేవలోనే మునిగి తేలుతుంది అనే మాట కూడా బాగా వినబడుతుంది. మహిళా ఫైర్ బ్రాండ్ గా వైసీపీ లో నోరేసుకుని పడిపోయే ఎమ్యెల్యేగా పేరు తెచ్చుకున్న రోజాకి ఈసారి నగరి టికెట్ దక్కుతుందో.. లేదంటే జగన్ ఏమంటారో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.