కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలని నిజం చేస్తూ నేడు శుక్రవారం తన రాజకీయ రంగప్రవేశంపై అధికారిక ప్రకటన ఇచ్చేసారు. చాలా రోజులుగా విజయ్ సేవా కార్యక్రమంతో మీడియాలో హైలెట్ అవుతూ అభిమానులకి దగ్గరవుతున్నారు. విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తన సేవలు అందించినా.. ఇప్పుడు తన కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. విజయ్ కొత్త పార్టీ పేరు తమిళక వెట్రి కజగం గా ప్రకటించారు.
ఈమధ్యన మక్కల్ ఇయక్కం (అభిమానుల సంఘం) నిర్వాహకులతో చాలాసార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపిన విజయ్ తమిళగ మున్నేట్ర కళగం పేరుతో పార్టీ స్థాపిస్థారని భావించినా.. దీనికి స్వల్ప మార్పులు చేసి తమిళిగ వెట్రి కళగం పేరు ఖరారు చేశారు. ఈ పార్టీ పేరుతొ విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతామని.. త్వరలోనే జెండా, అజెండాను ప్రకటిస్తామని విజయ్ ప్రకటించినా అవినీతి, కులమత విభజన, అధికార దురాచారాలు వంటి సమస్యల పై పోరాటమే ఏజండాగా విజయ్ బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది.