మెగాస్టార్ చిరంజీవి గ్రౌండ్ లోకి దిగిపోయారు. భోళా శంకర్ తర్వాత భారీ గ్యాప్ తో బింబిసార డైరెక్టర్ వసిష్ఠతో విశ్వంభర అనే పవర్ ఫుల్ టైటిల్ తో పిరియాడికల్ డ్రామాని మొదలు పెట్టారు. గత రెండు రోజులుగా మెగాస్టార్ చిరు వర్కౌట్స్ చేస్తూ ఎంతగా కష్టపడుతున్నారో, అలాగే విశ్వంభర మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతున్న అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో మెగా అభిమానుల సందడి జోరుగా కనిపిస్తుంది. చిరు గ్యాప్ లేకుండా విశ్వంభర షెడ్యూల్స్ కి హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు విశ్వంభర నుంచి మరో పవర్ ఫుల్ న్యూస్ బయటికి వచ్చింది.
భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కబోతున్న విశ్వంభర చిత్రాన్ని దర్శకుడు వసిష్ఠ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 10 న విడుదల చేస్తున్నట్టుగా ప్రీ లుక్ పోస్టర్ తో ప్రకటించారు. ఈలెక్కన 2025 సంక్రాంతికి పక్కాగా డేట్ ని లాక్ చేసి మొదటగా కచ్చిఫ్ వేసిన చిత్రంగా విశ్వంభర ముందువరసలోకి వచ్చింది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ 2025 సంక్రాంతి అని అనౌన్స్ చేసాడు. కానీ డేట్ లాక్ చెయ్యలేదు. ఇప్పుడు విశ్వంభరకి మాత్రం ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసి మరీ ప్రకటించారు.
మెగాస్టార్ చిరు గ్రౌండ్ లోకి దిగడమే విశ్వంభరని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ అయ్యి తేదీని ప్రకటించారన్నమాట.