కొద్దిరోజుల వరకు టాలీవుడ్ లక్కీ గర్ల్, క్యూట్ అండ్ స్వీట్ గా కనిపించిన శ్రీలీల ఇప్పుడు మాత్రం అన్ లక్కీ గర్ల్ గా మారిపోయింది. వరసవైఫల్యాలతో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా డల్ అయ్యింది. యంగ్ హీరోలు, స్టార్ హీరోల సినిమాలతో ఊపిరి సలపని పనితో ఉక్కిరిబిక్కిరైన శ్రీలీల ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయ్యింది. గుంటూరు కారం దెబ్బ ఆమెని కోలుకోనివ్వకుండా చేసింది. అయినా గుంటూరు కారంలో ఆమె డాన్స్ లని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
నిన్నమొన్నటివరకు ఆమె వైఫల్యాలని ఎత్తి చూపుతూ విమర్శలకు దిగిన క్రిటిక్స్ కూడా శ్రీలీల విషయం మరిచిపోయిన సమయంలో శ్రీలీల ఉన్నట్టుండి సోషల్ మీడియా X లో ట్రెండ్ అవడం కనిపించింది. శ్రీలీల సడన్ గా ట్రెండింగ్ లోకి రావడానికి కారణం గుంటూరు కారానికి ఊపు తెచ్చిన కుర్చీ పాటని ఈరోజు యూట్యూబ్ లో విడుదల చేసారు. ఆ సాంగ్ లో శ్రీలీల డాన్స్ అదరగొట్టేసింది. రెచ్చిపోయి ఆమె చేసిన డాన్స్ తోనే శ్రీలీల సడన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపించింది.