ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో డిజప్పాయింట్ చేసిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా సైంధవ్ చిత్రమే. విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేక మొదటి ఆట నుండే సైంధవ్ చతికిలపడ్డాడు. దీంతో ప్రేక్షకులు ఓటీటీలో చూసుకోవచ్చులే అని పండగకి ఈ సినిమాను పక్కన పెట్టేశారు. ఫలితంగా థియేటర్లలో ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో అవైడ్ చేసిన తీరు చూసిన మేకర్స్ ఆలస్యం చేయకుండా వెంటనే ఓటీటీకి తెచ్చే పనిని సంకల్పించుకున్నారు.
అయితే.. సైంధవ్ ఓటీటీకి సంబంధించి రెండు మూడు రోజులుగా ఓ డేట్ బాగా వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 2 నుండే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతుండగా.. నిజమేనా? అని కొందరు ఇంకా డౌట్స్‌లోనే ఉన్నారు. ఎందుకంటే, అఫీషియల్‌గా ఎక్కడా ఇంకా డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. అధికారికంగా సైంధవ్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. సైంధవ్ ఓటీటీ విడుదల విషయంలో ఇప్పటి వరకు వినిపించిన డేట్‌న కాకుండా.. ఒకరోజు ఆలస్యంగా అంటే.. ఫిబ్రవరి 3న ఈ సినిమా ఓటీటీలో దర్శనమివ్వనుంది.
యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ సైకోగా నటించారు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌గా ఉన్న వెంకటేష్‌కి సహాయం చేసే పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సైంధవ్‌తో తెలుగుకు పరిచయం కాగా.. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా వంటి వారు ఇతర పాత్రలలో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు.