Advertisementt

సిద్ధంపై నాగబాబు సైలెంట్ సెటైర్లు

Wed 31st Jan 2024 05:34 PM
nagababu jagan siddham  సిద్ధంపై నాగబాబు సైలెంట్ సెటైర్లు
Nagababu Satires on YS Jagan Siddham సిద్ధంపై నాగబాబు సైలెంట్ సెటైర్లు
Advertisement
Ads by CJ

వైఎస్ జగన్ తలపెట్టిన సిద్ధం కార్యక్రమంపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పంచ్‌ల మీద పంచ్‌లు వదులుతున్నారు. సోషల్ మీడియాలో సిద్ధంపై పడుతున్న పంచులు చూస్తే.. ఎందుకీ పేరు పెట్టామా? అని వైసీపీ వాళ్లు తల బాదుకుంటారు కూడా. సరే సిద్ధం అని అన్నారు కదా.. ఎన్నికల గురించి డైరెక్ట్‌గా ఏమైనా ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్నారా? అంటే అదీ లేదు. అసలీ కార్యక్రమంలో జగన్ ఏం మాట్లాడుతున్నాడో.. ఆయనకైనా తెలుసో.. లేదో అన్నట్లుగా ఉంది పరిస్థితి. పద్మవ్యూహం అంటాడు.. అర్జునుడు అంటాడు... సరిగ్గా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే రాదు.. రామాయణ, మహాభారతాలు మనకెందుకు అని కొందరు వైసీపీ వారే అనుకుంటున్నారంటే.. సిద్ధంలో జగన్ స్పీచ్‌లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

ఇక జగన్ సిద్ధం స్పీచ్‌లపై మెగా బ్రదర్ నాగబాబు సైలెంట్‌గా సెటైర్లు పేల్చుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన వదులుతున్న సెటైర్లకు మంచి స్పందన కూడా వస్తోంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లో చుట్టి పక్కనపెట్టే మీకెందుకండి రామాయణ మహాభారత ఉదాహరణలు.. అంటూ జగన్ పద్మవ్యూహ అర్జున స్పీచ్‌పై సెటైర్ పేల్చాడు నాగబాబు. మరో ట్వీట్‌లో శంఖం Sync లో‌ ఊదుంటే బాగుండు, Background లో Train Sound వస్తోంది, Beginners Mistakes ఇవన్ని... ఇలాంటివి ముందే సిద్దం అయితేనే సింకు, లింకు సరిగ్గా కుదరుతుంది.. అంటూ నాగబాబు మరో పంచ్ పేల్చారు. 

ఇక నాగబాబు ట్వీట్స్‌కి వస్తున్న కామెంట్స్ అయితే మరీ ఘోరం. ఇప్పటికే షర్మిల రూపంలో జగన్‌కు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇక సిద్దం అంటూ.. వారి పరువును వారే తీసుకుంటున్నారు. ఎన్నికలలో పలానా వారిని పోటీకి దింపుతున్నాను.. వారిని గెలిపించండి అని చెప్పడంలో హుందాతనం ఉంటుంది. అంతేగానీ, పంచ్‌లు, ప్రాసల కోసం ప్రాకులాడితే.. ఇలాగే ఉంటుంది మరి. స్క్రిప్ట్ రాసేవాళ్లు కాస్త చూసుకోండయ్యా.. 

Nagababu Satires on YS Jagan Siddham:

Comments on YSRCP Siddham Program

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ