Advertisementt

అత్తారింటికి దారేది డేట్‌కే హంగ్రీ చీతా

Wed 31st Jan 2024 08:18 AM
they call him og  అత్తారింటికి దారేది డేట్‌కే హంగ్రీ చీతా
Pawan Kalyan Starring OG Release Date Out అత్తారింటికి దారేది డేట్‌కే హంగ్రీ చీతా
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వేచి చూస్తున్న సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా హంగ్రీ చీతా OG సినిమానే అని చెప్పుకోవాలి. సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య నిర్మిస్తోన్న చిత్రం OG. ఈ సినిమాకు ముందు రెండు మూడు సినిమాలకు పవన్ కమిట్ అయినప్పటికీ.. OGకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తూ వచ్చారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంకా 15 రోజులు పవన్ టైమ్ కేటాయిస్తే చాలు.. షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు. 

ఏపీలో పాలిటిక్స్ హీటెక్కడంతో.. పవన్ కళ్యాణ్ అటు వైపు మనసు పెడుతున్నారు. లేదంటే ఈ సరికే సినిమా షూటింగ్ కంప్లీటై ఉండేది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వేచి చూస్తున్న వారికి.. గుడ్ న్యూస్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రమైన అత్తారింటికి దారేది సినిమా రిలీజైన తేదీకే హంగ్రీ చీతా ఆగమనం అని తెలుస్తుంది. సెప్టెంబర్ 27న ఓజీని విడుదల చేసేందుకు నిర్మాత డివివి దానయ్య ఫిక్స్ అయ్యారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం.. పవన్ కళ్యాణ్ మిగిలిన 15 రోజుల షూట్‌లో పాల్గొంటారని, ఈ లోపు ఇప్పటి వరకు షూట్ చేసిన పార్ట్‌కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సుజీత్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా సెప్టెంబర్ 27న ఓజీ థియేటర్లలోకి రావడం మాత్రం పక్కా.. అనేలా చిత్రయూనిట్ వర్గాల నుండి కూడా సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 27న వస్తే.. లాంగ్ వీకెండ్, దసరా సెలవులు కలిసొచ్చే అవకాశం ఉండటంతో మేకర్స్ ఈ డేట్‌కి ఫిక్స్ అయ్యారనేలా టాక్ వినబడుతోంది.

Pawan Kalyan Starring OG Release Date Out:

Pawan Kalyan and Sujeeth much awaited OG Aiming for Release on 27th September  

Tags:   THEY CALL HIM OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ